మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ‘కన్నప్ప’ (Kannappa) రూపొందుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే. అందుకే దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని స్వయంగా మంచు విష్ణునే నిర్మిస్తున్నాడు. అయితే ఈ రోజుల్లో ఏ సినిమాకి అయినా విడుదలకి ముందే నిర్మాతలు ఓటీటీ, డిజిటల్ బిజినెస్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అప్పుడే తాము పెట్టిన బడ్జెట్లో రికవరీ అవుతుంది అనేది వారి నమ్మకం.
ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు పెట్టే కండిషన్స్ కి కూడా తల వంచుతున్నారు. ఇందులో భాగంగా.. సినిమాను ముందుగా వాళ్ళకి చూపించాలి. వాళ్ళు చెప్పిన డేట్ కి సినిమాని రిలీజ్ చేయాలి. వాళ్ళు చెప్పిన డేట్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వదిలేయాలి. అలా అయితే డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. ‘కన్నప్ప’ కి కూడా ఓటీటీ సంస్థలు అలాగే డిమాండ్ చేస్తున్నాయి. కానీ మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం వాళ్ళ డిమాండ్లకు తలవంచడం లేదు.
దీనికి కారణం తన సినిమాలో కంటెంట్ ఉందనో లేక తన సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారనో కానీ.. మంచు విష్ణు అస్సలు తగ్గడం లేదు. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ చేసుకోకుండా ‘కన్నప్ప’ ని థియేటర్లకు వదలడం పెద్ద రిస్క్. ఎందుకంటే ఒకవేళ టాక్ తేడాగా వస్తే.. ఓటీటీ సంస్థలు సినిమా రైట్స్ ని తీసుకోవడానికి ముందుకు రావు. ఒకవేళ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. అప్పుడు ఎక్కువ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి ఎగబడతాయి. చూద్దాం ఈ రెండిటిలో ఏం జరుగుతుందో.