చాలామంది దర్శకులు మోసం చేశారు : విష్ణు

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం. నవదీప్, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మంచు విష్ణు తనకు మొహమాటం ఎక్కువని అందువల్లే సినిమా ప్రమోషన్స్ కోసం జనాల్లోకి ఎక్కువగా వెళ్లేవాడిని కాదని అన్నారు.

అయితే సినిమా ప్రమోషన్స్ కోసం జనాల్లోకి వెళ్లకపోవడం తప్పని ఆలస్యంగా తెలుసుకున్నానని తెలిపారు. ఈ సినిమా కోసం తన దగ్గర డబ్బంతా ఖర్చు చేశానని.. మోసగాళ్లు సినిమా ప్రమోషన్స్ కొరకు అన్ని ఏరియాలు తిరుగుతున్నానని విష్ణు పేర్కొన్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని.. తనను చాలామంది దర్శకులు మోసం చేశారని ఈ సినిమా తీయడానికి వాళ్లు కూడా కారణమని విష్ణు పేర్కొన్నారు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా మోసగాళ్లు మూవీ తెరకెక్కిందని.. అక్కాతమ్ముడు ఈ స్కామ్ చేయడానికి గల కారణాలతో పాటు అమెరికన్లు అక్కాతమ్ముడిని ఎందుకు పట్టుకోలేకపోయారనే అంశాలను కూడా చాలా వివరంగా చెప్పామని విష్ణు వెల్లడించారు.

ఎన్నో ఛాలెంజ్ లతో కూడుకున్న కథ మోసగాళ్లు అని విష్ణు తెలిపారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నామని.. సినిమాపై పూర్తి నమ్మకం ఉందని విష్ణు చెప్పారు. మోసగాళ్లు మూవీ కథను మలుపులతో సినిమాటిక్ గా చెప్పామని.. సినిమాపై ఉన్న నమ్మకం వల్లే పది నిమిషాల స్నీక్‌పీక్‌ ను చూపించామని విష్ణు అన్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో తనకు అక్కగా నటించారని.. కాజల్ అగర్వాల్ పక్కన హీరోగా నటించాలంటే తనకు కష్టంగా ఉందని విష్ణు పేర్కొన్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus