Manchu Vishnu: వైరల్ అవుతున్న మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మాత్రం టీజర్ లో ఎలాంటి క్లారిటీ లేదు. 150 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. టీజర్ లాంఛ్ ఈవెంట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కన్నప్ప టీజర్ లో యాక్షన్ సీన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కన్నప్ప సినిమా తీయమని శివుడు నాకు చెప్పాడని మంచు విష్ణు పేర్కొన్నారు. 2019 లో న్యూజిలాండ్ కు వెళ్లే సమయంలో నాన్న పిలిచి దర్శకుడిని ఎంపిక చేయలేదని నువ్వు మాత్రం లొకేషన్స్ చూస్తున్నావేంటి అని అడిగారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను నాన్న..

పరమేశ్వరుడు ఎప్పుడు అనుమతి ఇస్తాడో ఆరోజు నేను తీయడానికి ప్రిపేర్డ్ గా ఉండాలని నేను హోం వర్క్ అంతా చేస్తున్నానని చెప్పానని మంచు విష్ణు కామెంట్లు చేశారు. గతేడాది జనవరిలో శివుడు అనుమతి ఇచ్చాడని ఈ సినిమా మీ ముందుకు రావడానికి శివుడి ఆశీస్సులే కారణం అని మంచు విష్ణు పేర్కొన్నారు. మంచు విష్ణు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాదే కన్నప్ప మూవీ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్ప సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. కన్నప్ప రిలీజ్ డేట్ గురించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus