కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు విషయంపై జగన్ ప్రభుత్వం జారీ చేసి జీవో నుంచి ఈ గొడవ మొదలైంది. టికెట్ రేట్ల తగ్గింపుపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించడం హాట్ టాపిక్ అయింది. మధ్యలో రామ్ గోపాల్ వర్మ కూడా ఇన్వాల్వ్ అయ్యి తనదైన రీతిలో వివరణ ఇవ్వడంతో ఈ ఇష్యూపై అందరి దృష్టి పడింది.
రీసెంట్ గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి బృందం భేటీ కావడం.. ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా అదే బాట పట్టడంతో టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అంతకముందు జగన్ తో చిరంజీవి ఒక్కరే భేటీ అయినప్పుడు కొందరు విమర్శించారు. ఆ లిస్ట్ లో మంచు విష్ణు కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా మెగాస్టార్.. టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళిలను వెంటబెట్టుకొని జగన్ ను కలిశారు.
ఈ మీటింగ్ లో సినిమా టికెట్స్ రేట్లు మొదలుకొని.. ఇండస్ట్రీ కష్టాలు, సినీ పరిశ్రమ అభివృద్ధి విషయంపై కీలక విషయాలను చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన టాలీవుడ్ హీరోలు త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని చెప్పారు. ఈ మీటింగ్ తరువాత ఏపీ మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు, మంచు విష్ణులను హైదరాబాద్ లో కలిశారు. ఈ క్రమంలో ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ తో మంచు విష్ణు సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే మంచు విష్ణు తాడేపల్లికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ, టికెట్ రేట్ల విషయాలపై ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణుతో ఈరోజు మీటింగ్ ఉంటుందని సమాచారం.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!