Manchu Vishnu, Prakash Raj: ప్రకాష్ రాజ్ కు భారీ షాకిచ్చిన మంచు విష్ణు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తరువాత ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు విష్ణు ప్యానల్ సభ్యుల గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న విష్ణు నాగబాబు, ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేయడం గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నానని విష్ణు చెప్పుకొచ్చారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని పోలింగ్ సమయంలో చిన్నచిన్న గొడవలు జరిగాయని ఇరువైపులా తప్పులు జరిగాయని విష్ణు తెలిపారు.

ప్రకాష్ రాజ్ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించుకోవచ్చని తనకు అభ్యంతరం లేదని విష్ణు పేర్కొన్నారు. అలయ్ బలయ్ ప్రోగ్రామ్ లో స్టేజ్ పైకి రాకముందే పవన్ తో మాట్లాడానని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులలో ఒకరి నుంచి మాత్రమే రాజీనామా అందిందని మిగతా సభ్యుల రాజీనామాలు అందలేదని విష్ణు పేర్కొన్నారు. విష్ణు తన కామెంట్లతో ప్రకాష్ రాజ్ కు భారీ షాకిచ్చారు. రాజీనామాలు అందితే సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని విష్ణు పేర్కొన్నారు.

సినీ పెద్దలతో చర్చించి అసోసియేషన్ లోని బై లాస్ ను మార్చాలని అనుకుంటున్నానని ఎవరంటే వాళ్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కాకూడదని తాను భావిస్తున్నానని విష్ణు వెల్లడించారు. గెలుపు కోసం ప్రార్థించిన అందరికీ విష్ణు ప్యానల్ సభ్యుడైన మాదాల రవి ధన్యవాదాలు తెలిపారు. విష్ణు ప్రకటించిన మ్యానిఫెస్టో వల్లే తాము గెలిచామని మాదాల రవి చెప్పుకొచ్చారు. ఎన్నికలు అయ్యాక మేము అంతా ఒకే కుటుంబమని మాదాల రవి పేర్కొన్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus