సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి ఇప్పటికే చాలా మంది నటీమణులు బయటకొచ్చి మాట్లాడారు. ఈ క్రమంలో తాజాగా మరో నటి మందనా కరిమి ఓ నిర్మాతపై చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మందనా బయటపెట్టింది. సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కోకో కోలా’ అనే సినిమాలో మందనా కూడా ఓ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత మహేంద్ర ధరివాల్ తన్నాడు మానసికంగా వేధించాడంటూ మందనా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాల్షీట్ల ప్రకారం దీపావళి ముందురోజు రాత్రి వరకు సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని.. చివరి రోజు షూటింగ్ లో ప్రొడ్యూసర్ ప్రవర్తన తనను బాధించిందని మందనా వెల్లడించింది. తను ఇచ్చిన కాల్షీట్లు అయిపోయినప్పటికీ.. సినిమాలో ఇంకొన్ని బ్యాలెన్స్ సన్నివేశాలు ఉన్నాయని.. కాబట్టి ఇంకొంతసేపు సెట్ లోనే ఉండాని నిర్మాత చెప్పారట. అయితే అదే సమయంలో తనకు వేరే మీటింగ్స్ ఉండడంతో మందనా కుదరదని చెప్పి క్యారవాన్ లోకి వెళ్లిపోయి..
డ్రెస్ మార్చుకుంటుండగా.. అదే సమయంలో నిర్మాత నేరుగా క్యారవాన్ లోకి రావడమే కాకుండా.. తనని అనరాని మాటలు అన్నాడని.. మందనా వెల్లడించింది. బట్టలు మార్చుకొని బయటకి వచ్చి మాట్లాడతా అని చెప్పినా.. వినిపించుకోకుండా తనను దూషించాడని తెలిపింది. మహేంద్ర మగాళ్లకు మాత్రమే ఫేవరబుల్ గా ఉంటారని అమ్మాయిలను తక్కువగా చూస్తారని తెలిపింది.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!