వయసు పక్కనెట్టి కష్టపడుతున్న మందిరాబేడీ

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా సాగుతోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200 కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు ఎక్కువమంది ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా శ్రద్ధ కపూర్, విలన్ గా నీల్ నితిన్ ముకేష్, మరికొన్ని కీలక పాత్రలో చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, టిన్ను ఆనంద్ లు నటిస్తున్నారు. సాహోలో నటించడం చాలా ఎక్సయిటెడ్ గా ఫీలవుతున్నానని మందిరా కొంతకాలం క్రితం స్పష్టం చేసింది. “సాహోలో నా రోల్ బాగుంటుంది.

అందుకే తొలిసారి తెలుగు మూవీ చేస్తున్నా” అని కూడా చెప్పింది. ఇష్టమైన రోల్ కాబట్టి మరింత కష్టపడుతోంది. 46 ఏళ్ల వయసులోనూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి శ్రమిస్తోంది. ప్రతి రోజూ 10 కిలోమీటర్ల దూరం పరిగెడుతోంది. తాజాగా ఆమె జిమ్ లో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూస్తే ఆమె కష్టం అర్ధమవుతోంది. అందుకే ఈ ఫోటోకి అనేక లైక్లు వస్తున్నాయి. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత సాహో టీమ్ దుబాయ్ కి షిఫ్ట్ కానుంది. దుబాయ్ శివరాల్లోని కొండల్లో భారీ యాక్షన్ సీన్ తెరకెక్కించనున్నారు. అక్కడి షూటింగ్లో ప్రభాస్, శ్రద్ధ కపూర్, నీల్ నితిన్ ముఖేష్ తో పాటు మందిరాబేడీ కూడా పాల్గొననుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus