ఆర్ఎక్స్ 100’ చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఆమెని చాలా బోల్డ్ గా, నెగటివ్ రోల్ లో చూపించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ప్రభావం వల్లనో ఏమో తెలీదు కానీ, ఆమెకి మొన్నటి వరకు కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.
ఆర్ఎక్స్ 100’ చిత్రం లో యాక్టింగ్ అదరగొట్టేసింది, భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు. రీసెంట్ గా ఈమె ‘మంగళవారం’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన రిలీజైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్నది.
కానీ మంగళవారానికి ఆదివారం (ప్రపంచ కప్ ఫైనల్) అడ్డుగా వచ్చింది. క్రికెట్ ఫీవర్ లో కాస్త కమర్షియల్ గా తడబడిన సోమవారం నుండి అన్ని ఏరియాలోను భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. దాంతో ఈ సినిమా ఏపీ, నైజాం, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల షేర్..10 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో వసూలయ్యే కలెక్షన్లు బట్టి భారీగానే బాక్సాఫీస్ వద్ద నమోదు అయ్యే అవకాశం ఉంది. పాయల్ రాజ్ పుత్, దర్శకుడు భూపతికి మరో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ అప్పుడే బయటకి వచ్చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 10 వ తారీఖున ఈ చిత్రం అన్నీ ప్రాంతీయ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం. అలాగే ఓటీటీ ప్రేక్షకుల ద్వారా కూడా ఈ సినిమాకు రెస్పాన్స్ దక్కుతుందని ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!