Mani Ratnam: 70 ఏళ్ల కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్‌.. మణిరత్నం రియాక్షన్‌ ఇదే!

‘థగ్‌ లైఫ్‌’ (Thug Life)  సినిమా ట్రైలర్‌ వచ్చినప్పటి నుండి.. ఆ ట్రైలర్‌ ఎలా ఉంది? సినిమా ఎప్పుడు? అనే ప్రశ్నలు కాకుండా అందులో రొమాంటిక్‌ సన్నివేశాలు, లిప్‌ లాక్‌ల గురించే చర్చ జరుగుతోంది. 70 ఏళ్ల కమల్‌తో (Kamal Haasan) 42 ఏళ్ల త్రిష (Trisha)   రొమాన్స్‌ ఏంటి? అనే ప్రశ్నతో సోషల్‌ మీడియాను ఊదరగొడుతున్నారు. అలా ఎలా చేస్తారు? అలా ఎలా తీస్తారు అంటూ మాస్టర్‌ క్లాస్‌లు పీకుతున్నారు. అయితే ఇక జీవితంలో ఇలాంటి ప్రశ్నలు రాకుండా ఆ సినిమా దర్శకుడు మణిరత్నం (Mani Ratnam)  రిప్లై ఇచ్చారు.

Mani Ratnam

నిజ జీవితంలో పురుషులు, మహిళలు ఎవరైనా తమ కంటే వయసులో చిన్నవారితో లేదంటే పెద్దవారితో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అది జీవిత సత్యం. ఎవరూ కాదనలేని విషయం. ఇలాంటి బంధాలు ఇప్పుడు పుట్టినవి కావు. ఎంతో కాలం నుండి సమాజంలో ఉన్నాయి. ఒక సన్నివేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని చూస్తున్నప్పుడు వాళ్లు కమల్‌ హాసన్‌, త్రిష అని అనుకోకూడదు. వాళ్లు పోషిస్తున్న పాత్రలు అనుకోవాలి. అంతేకాని వాళ్లిద్దరి వయసును చూడకూడదు అని క్లారిటీ ఇచ్చారు మణిరత్నం.

మణిరత్నం ఆన్సర్‌ కేవలం ఈ ఒక్క సినిమాకే కాదు.. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలన్నింటికీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మన సినిమాల్లో ఈ ఏజ్‌ గ్యాప్‌ కాంబినేషన్లు ఎక్కువగానే వస్తున్నాయి. 1987లో ‘నాయకన్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత కమల్‌ హాసన్‌ – మణిరత్నం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలసి ఈ సినిమా చేశారు.

త్రిష, శింబు (Silambarasan) ఇతర కీలక పాత్రల్లో నటించారు. జూన్‌ 5న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. మీరు కూడా చూసే ఉంటారు. అందులో త్రిష, అభిరామితో (Abhirami)  కమల్‌ హాసన్‌ రొమాన్స్‌ చేసే సన్నివేశాలు ఉన్నాయి. సినిమాలో ఎన్ని ఉన్నాయి అనేది చూడాలి. అది వేరే విషయం అనుకోండి.

 ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus