Mani Sharma: దయచేసి తప్పుగా తీసుకోకండి.. వివాదంపై మణిశర్మ రియాక్షన్ ఇదే!

డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) మూవీ విడుదలకు సరిగ్గా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఏం జేద్దామంటావ్ మరి సాంగ్ విషయంలో ఒకింత వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ వివాదం గురించి పూరీ జగన్నాథ్ సైతం స్పందించకపోయినా మణిశర్మ (Mani Sharma) స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కల్లు కాంపౌండ్ లో ఈ సాంగ్ షూట్ జరిగిందని ఆయన తెలిపారు. కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి అని ఆయన మనందరికీ ఫేవరెట్ అని మణిశర్మ తెలిపారు. ఆయనను చాలా మీమ్స్ లో చూస్తుంటాం అని అలా మీమ్స్ లో నుంచి తీసి ఈ డైలాగ్ ను వాడటం జరిగిందని మణిశర్మ అభిప్రాయపడ్డారు. ఆ సాంగ్ అల్టిమేట్ సాంగ్ అని అందులో కేసీఆర్ డైలాగ్ పెడితే బాగుంటుందని భావించి డైలాగ్ పెట్టామే తప్ప అంతకు మించి ఏమీ లేదని మణిశర్మ పేర్కొన్నారు.

కేసీఆర్ ను కించపరచాలని మేము భావించలేదని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ సాంగ్ చేశామని మణిశర్మ చెప్పుకొచ్చారు. దయచేసి దీన్ని తప్పుగా తీసుకోవద్దని మణిశర్మ వెల్లడించారు. ఈ సాంగ్ ఐటమ్ సాంగ్ కాదని హీరో హీరోయిన్లు కలిసి చేసే డ్యూయెట్ సాంగ్ అని మణిశర్మ పేర్కొన్నారు. ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

రామ్ (Ram) , పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. కావ్య థాపర్ (Kavya Thapar)  ఈ సినిమాలో రామ్ కు జోడీగా నటించారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కావ్య థాపర్ కూడా కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus