ఒక్క సినిమాతో మళ్ళీ పూర్వ వైభవం

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకి సంగీత దర్శకుడిని తీసుకోవాలి అంటే అందరూ మణిశర్మ నే ప్రిఫర్ చేసే వారు. చిరంజీవి ‘ఇంద్ర’ ‘ఠాగూర్’.. బాలకృష్ణ ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహా నాయుడు’ ‘లక్ష్మీ నరసింహా’ , ఎన్టీఆర్ ‘ఆది’.. మహేష్ బాబు ‘ఒక్కడు’ ‘పోకిరి’.. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ వంటి సినిమాలకు ఈయన ఇచ్చిన సంగీతం అలాగే నేపధ్య సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది అనడంలో సందేహం లేదు. కానీ తరువాత దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి యువ సంగీత దర్శకులు రావడంతో ఈయన్ని దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు.

నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్ మెన్’, నితిన్ హీరోగా వచ్చిన ‘లై’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినప్పటికీ ఎందుకో కోలుకోలేకపోయాడు. మహేష్ బాబు.. వెంకటేష్ ల మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అలాగే ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చినా ఈయన్ని ఎవ్వరూ గుర్తుచేసుకోలేదు. కానీ ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మాత్రం ఈయన స్టామినా ఏంటనేది మరోసారి ప్రూవ్ చేసింది. యావరేజ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకి ఈయన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపాడు. దీంతో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న మెగాస్టార్ 152 వ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ కొట్టేసాడు. అంతేకాదు ఇప్పుడు వెంకటేష్ హీరోగా రూపొందుతోన్న ‘అసురన్’ తెలుగు రీమేక్ కు కూడా మణిశర్మ ను సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టు టాక్ నడుస్తుంది. చూస్తుంటే మణిశర్మ కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్టే కనిపిస్తుంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus