Mark Antony: ‘మార్క్ ఆంటోనీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Advertisement

తమిళ స్టార్ హీరో విశాల్ సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ అవుతాయి అతని సినిమాలు..! ‘మార్క్ ఆంటోని’ ఆ కోవలోకే వస్తుంది. సెప్టెంబర్ 15 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.

ఎస్ జే సూర్య, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. మార్క్ ఆంటోని ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన కంటెంట్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.50 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర 1.00 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.00 cr

‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) చిత్రానికి తెలుగులో రూ.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.25 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus