Prabhas: డైరెక్టర్ మారుతికి షాక్.. ప్రభాస్ ఎంట్రీ ఇస్తేనే ఈ గొడవ ఆగుతుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తో కొనసాగుతోంది. ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో కొందరు సంతృప్తిగా ఉన్నా, మరికొందరు మాత్రం దర్శకుడు మారుతి మేకింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, మారుతి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Prabhas

ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు జరిగిన ఈవెంట్‌లో మారుతి ఎమోషనల్‌గా తన ఇంటి అడ్రస్ చెప్పడం ఇప్పుడు ఆయనకే తలనొప్పిగా మారింది. సినిమా నచ్చకపోతే తన ఇంటికి వచ్చి అడగమన్న మాటలను సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు, వినూత్నంగా వేధించడం మొదలుపెట్టారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మారుతి నివాసానికి వందల సంఖ్యలో ఆర్డర్లు పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీ సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ఈ తరహా ప్రవర్తనపై నెటిజన్లు సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఒక దర్శకుడిని వ్యక్తిగతంగా ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. అభిమానం పేరుతో సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బతీస్తే టాలీవుడ్ ఇమేజ్ పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నెగిటివ్ టాక్ వచ్చిందన్న కారణంతో ఇలాంటి పనులు చేయడం హద్దులు దాటడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ గొడవ సద్దుమణగాలంటే హీరో ప్రభాస్ స్వయంగా స్పందించాలని చాలా మంది కోరుతున్నారు. ప్రభాస్ ఒక్క మాట చెబితే అభిమానులు శాంతిస్తారని, మారుతిపై జరుగుతున్న ఈ ‘పార్సిల్’ అటాక్ ఆగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. మరి తన డైరెక్టర్ ఎదుర్కొంటున్న ఈ వింత సమస్యపై ప్రభాస్ ఎప్పుడు రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus