Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రవితేజ (Hero)
  • శ్రీలీల (Heroine)
  • నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు (Cast)
  • భాను భోగవరపు (Director)
  • సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య (Producer)
  • భీమ్స్ సిసిరోలియో (Music)
  • విధు అయ్యన్న (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : అక్టోబర్ 31, 2025
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ (Banner)

రచయితగా “సామజవరగమన, సింగిల్” వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకుని.. దర్శకుడిగా “మాస్ జాతర” సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాడు భాను భోగవరపు. రవితేజ (Ravi Teja) – శ్రీలీల (Sreeleela) కాంబినేషన్ లో నాగవంశీ నిర్మించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ లిమిటెడ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Mass Jathara Movie Review

కథ: నిజాయితీ గల రైల్వే పోలీస్ లక్ష్మణ్ (రవితేజ). తన జోన్ లోకి వచ్చిన ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటాడు. అలా శ్రీకాకుళం జిల్లాలో రైతులతో బలవంతంగా గంజాయి పండిస్తున్న శివుడు (నవీన్ చంద్ర)ను ఎదుర్కొంటాడు.

ఆ క్రమంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా జయించాడు? అనేది “మాస్ జాతర” కథాంశం.

నటీనటుల పనితీరు: రవితేజ ఎప్పట్లానే తనదైన ఎనర్జీతో లక్ష్మణ్ అనే పాత్రకు న్యాయం చేశాడు. ఆయన మార్క్ ఎనర్జిటిక్ డ్యాన్స్, మాస్ ఫైట్స్ తో ఎంగేజ్ చేశాడు.

శ్రీలీలను చూస్తుంటే ఒక్కోసారి ఆమె పాటలకి పరిమితం అయిపోతేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆమెకు పెట్టిన క్లోజప్ షాట్స్ అయితే చాలా ఇబ్బందిపెడతాయి.

నవీన్ చంద్ర మరోసారి మాస్ విలన్ గా ఆకట్టుకున్నాడు. అయితే అతని క్యారెక్టర్ ఆర్క్ సరిగా లేకపోవడంతో అతడి రేంజ్ సరిగా ఎలివేట్ అవ్వలేదు.

రాజేంద్రప్రసాద్, నరేష్ ల కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. హైపర్ ఆది, అజయ్ ఘోష్ మాత్రం కామెడీ విలన్స్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

సాంకేతికవర్గం పనితీరు: భీమ్స్ పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం కొంచం కేర్ తీసుకోవాల్సింది. ఆ ఇంగ్లీష్ ర్యాప్ బీజియం ఎక్కువసార్లు రిపీట్ అవ్వడం, అందులో పదాలు అర్థం కాకపోవడంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఆ మాస్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేయలేం.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. కాకపోతే.. యాక్షన్ బ్లాక్ ను ఇంకాస్త ప్రోపర్ గా పిక్చరైజ్ చేసి ఉంటే బాగుండేది. మాస్ మూమెంట్స్ ను సరికొత్త ఫ్రేమింగ్ తో తెరకెక్కించడం అనేది చాలా కీలకం.

ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ వంటి డిపార్ట్మెంట్స్ అన్నీ తమ బెస్ట్ ఇచ్చారు. నాగవంశీ ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు అని ఫైట్స్ & సాంగ్స్ లో క్రౌడ్ ను చూస్తేనే అర్థమవుతుంది.

దర్శకుడు భాను భోగవరపు దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో జనాల ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, రాజేంద్రప్రసాద్ ఫైట్ సీన్ కావచ్చు, విలన్ ఇంటికి హీరో వెళ్లి భోజనం చేసే సీక్వెన్స్ కావచ్చు.. ఇలా మాస్ ఆడియన్స్ ను అలరించే సీన్లు చాలానే ఉన్నాయి. అయితే.. వాటి ఎగ్జిక్యూషన్ మాత్రం ఆకట్టుకునే స్థాయిలో లేదు. అందువల్ల దర్శకుడిగా అలరించడంలో భాను భోగవరపు తడబడ్డాడనే చెప్పాలి.

విశ్లేషణ: రొటీన్ కమర్షియల్ సినిమాను చాలాసార్లు తక్కువ చేసి మాట్లాడతారు కానీ.. మాస్ ప్లీజింగ్ సినిమా ఆది. అయితే.. ఆ మాస్ ను అలరించడం అనేది అంత ఈజీ కాదు. కథకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఎంత జాగ్రత్తపడతాడో, దర్శకుడు సీన్ కంపోజిషన్ విషయంలోనూ అంతే జాగ్రత్తపడాలి. భాను చేసిన తప్పు అదే.. మంచి సీన్, సందర్భం రాసుకున్నాడు కానీ.. వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో కొత్తదనం చూపలేకపోయాడు. అందువల్ల ఎంటర్టైన్ చేయాల్సిన రొటీన్ కమర్షియల్ సినిమా చాలా చోట్ల బోర్ కొట్టిస్తుంది. అయితే.. రవితేజ ఎనర్జీ మాత్రం సినిమాని కాపాడింది.

ఫోకస్ పాయింట్: రవితేజ మార్క్ రొటీన్ మాస్ మసాలా సినిమా!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus