మాస్ మహారాజ్ రవితేజకి ‘ధమాకా’ తర్వాత సరైన హిట్ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ కూడా నిరాశపరిచింది. దీంతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు రవితేజ. ఈ క్రమంలో దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్లింప్స్, ‘తు మేరా లవర్’ పాటలు ఆకట్టుకున్నాయి. ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ డోస్ పెంచుతూ తాజాగా టీజర్ ను వదిలారు.
‘మాస్ జాతర’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:35 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘ఇక్కడో కాలేజ్ స్టూడెంట్ ని చంపేశాడు సార్’ అంటూ మురళీశర్మ వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది. వెంటనే ‘వాడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి’ అంటూ విలన్ హీరో(రవితేజ) గురించి అడగడం.. అందుకు ‘రైల్వే పోలీస్’.. ‘కానీ అందరి పనుల్లోనూ వేలు పెడతాడు’ వంటి డైలాగులతో హీరో క్యారెక్టరైజేషన్ ను కూడా పరిచయం చేయడం జరిగింది. సినిమా కథ చాలా వరకు రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్లోనే సాగుతుంది. మాస్ ఆడియన్స్ ను అలరించే విధంగా కామెడీ.. యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేశారు. రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ వంటి వాళ్ళు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్ అయితే బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :