Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

‘వార్‌ 2’ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు ఓ అప్‌డేట్‌ తప్పిస్తే.. ఇంకా ఏమీ చెప్పడం లేదు.. దీంతో సినిమా మీద బజ్‌ తగ్గిపోతోంది అని అందరూ అనుకుంటున్న సమయంలో ‘ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేస్తున్నాం’ అంటూ మళ్లీ ట్రాక్‌ ఎక్కించారు తారక్‌ రీసెంట్‌ సినిమా, ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న యువ నిర్మాత నాగవంశీ. దీంతో ఈ ఈవెంట్‌లో తారక్‌ ఎలా మాట్లాడతాడు, ఏం చెబుతాడు, సినిమా మీద ఎలాంటి హైప్‌ పెంచుతాడు లాంటి డౌట్స్‌ మొదలయ్యాయి. ఆ ఈవెంట్‌ అయిపోయింది.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌లోకి వచ్చారు.

Jr NTR

అయితే తారక్‌ మాటలు వింటే ఇంకో చిన్న డౌట్‌ మొదలైంది. అదే తారక్‌ ఉద్దేశమేంటి? ఓవైపు సినిమా మీద నమ్మకం ఉంది, సినిమా విజయం మీద నమ్మకం ఉంది అనేలా ఓ పని చేసి.. ఆఖరులో మొత్తం భారం పంపిణీ నిర్మాత నాగవంశీ మీద వేసేయడమే దీనికి కారణం. ‘దేవర’ సినిమా సమయంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చిన ఒకవైపు కాలర్‌ ఎత్తి.. మీరు కూడా ఈ సినిమా విషయంలో ఇలానే చేస్తారు.. నాదీ బాధ్యత అని చెప్పారు. సినిమాకు వారు ఊహించిన ఫలితం అయితే వచ్చింది.

ఇప్పుడు ‘వార్‌ 2’ సినిమా మీద అంచనాలు పెండానికో, లేక సినిమా మీద ఉన్న నమ్మకం చూపించడానికి రెండు వైపులా కాలర్‌ ఎత్తి చూపించి ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచాడు. తారక్‌కి హృతిక్‌ కూడా తోడై రెండు కాలర్లు లేచాయి. దీంతో ఎన్టీఆర్‌ ఇంత ధైర్యంగా ఉన్నాడంటే సినిమా ఎలా ఉండొచ్చో అంచనా వేసుకోండి అని ఫ్యాన్స్‌ అంటున్న లోపే.. ప్రసంగం ముగిస్తూ ‘నాగవంశీ దయతలిస్తే సక్సెస్‌ మీట్‌లో కలుద్దాం’ అని అన్నాడు. దీంతో మళ్లీ ఇదేంటి అనే చర్చ మొదలైంది.

సినిమా మీద అంత నమ్మకం ఉంటే మళ్లీ సక్సెస్‌ మీట్‌ కోసం ఆలోచన ఎందుకు.. కచ్చితంగా సినిమా విడుదలయ్యాక కలుద్దాం అని అనేవాడు తారక్‌ అని కొందరు అంటుంటే.. ఈవెంట్‌ ఏర్పాటు విషయంలో నాగవంశీ గురించి మాట్లాడాడు తారక్‌ అని మరికొందరు అంటున్నారు. ఈ విషయం తేలాలి అంటే ఆగస్టు 14 రావాల్సిందే.

 

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags