Ravi Teja: ఆ ఒక్క విషయంలో మాస్ మహారాజ్ తప్పు చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజకు గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో షాకులు తగులుతున్నాయి. ఒక సినిమా హిట్టైతే వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో రవితేజ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న రవితేజ నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం నిర్మాతలకు భారీ షాకిస్తున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే పరిస్థితి కూడా లేదు.

రవితేజ సినిమాలు ఈ స్థాయిలో ఫ్లాప్ కావడం రవితేజ అభిమానులను సైతం ఎంతగానో బాధపెడుతోంది. అయితే రవితేజ సినిమాలు ఫ్లాప్ కావడానికి అసలు కారణం దర్శకుల ఎంపికలో చేస్తున్న తప్పులు, హీరోయిన్ల ఎంపికలో చేస్తున్న తప్పులు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరున్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించిన ప్రతిసారి రవితేజ సక్సెస్ ను సొంతం చేసుకున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని హీరోయిన్లు రవితేజకు జోడీగా నటిస్తే రవితేజ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

రవితేజ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాల ఫలితాలే రవితేజ కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాలతో రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఒక్కో సినిమాకు రవితేజ 18 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా రవితేజ రెమ్యునరేషన్ రేంజ్ లో కూడా ఆయన సినిమా కలెక్షన్లు సాధించకపోవడం గమనార్హం. రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా రవితేజ కెరీర్ పుంజుకుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus