Ravi Teja: రవితేజ కోసం ఎగబడుతున్న దర్శకులు.. మరొకరికి గ్రీన్ సిగ్నల్!

Ad not loaded.

హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన ఎనర్జీ, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న హీరో రవితేజ (Ravi Teja). మాస్ రాజా కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా, తన ప్రత్యేకమైన స్టైల్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, పూరి జగన్నాథ్ ఇచ్చిన బ్రేక్‌తో హీరోగా నిలదొక్కుకున్న రవితేజ, ఇంతవరకు 70కి పైగా సినిమాల్లో నటించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన సినిమాలు రవితేజ కెరీర్‌లో ప్రత్యేకమని చెప్పాలి.

Ravi Teja

ఇక ఇటీవల రవితేజ నటించిన ధమాకా (Dhamaka) సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. అయితే, భారీ అంచనాలతో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao), మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో లాభాలు అందించలేదు. ఇప్పుడు మళ్లీ పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌ ‘మాస్ జాతర’ (Mass Jathara) తో రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే, రవితేజతో సినిమా చేసేందుకు ఇద్దరు దర్శకులు పోటీ పడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్.

ఉన్నది ఒకటే జిందగీ (Vunnadhi Okate Zindagi), చిత్రలహరి (Chitralahari) వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల (Kishore Tirumala), మాస్ మహారాజాకు ఓ స్ట్రాంగ్ ఎమోషనల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ ఈ కథకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, మ్యాడ్ (MAD) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కళ్యాణ్ శంకర్ కూడా రవితేజ కోసం ఓ మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రవితేజ ఈ రెండు కథల్లో ముందుగా కిషోర్ తిరుమల కథను పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ శంకర్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు టాక్. కిషోర్ ప్లాన్ ప్రకారం ఆ ప్రాజెక్టు 5 నెలల్లోనే ఫినిష్ అయ్యే అవకాశం ఉందట. ఇక ఈ కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న నేపథ్యంలో, అభిమానులు రవితేజ (Ravi Teja) నుంచి మరో హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రాబోయే మాస్ జాతర సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus