Ravi Teja: రవితేజ లిస్ట్ లో మాస్ డైరెక్టర్!

మాస్ మహారాజా రవితేజ చాలా ఏళ్ల తరువాత ‘క్రాక్’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తరువాత ఆయన నుంచి రెండు సినిమాలు వచ్చాయి. ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ రెండూ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ రవితేజ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ముందుగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను పూర్తి చేయాల్సివుంది. అలానే ‘ధమాకా’, ‘రావణాసుర’ సినిమాలు ఒప్పుకున్నారు. ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు రవితేజ.

ఇప్పుడు ఆయన మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఎన్నో మాస్ సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు శ్రీవాస్ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తికాకుండానే రవితేజకి కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. రవితేజ-శ్రీవాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల రవితేజకు పూర్తి స్థాయిలో కథ వినిపించేశారు శ్రీవాస్. ఈ కథ రవితేజకు బాగా నచ్చింది. అందుకే చేతిలో ఉన్న సినిమాలను పక్కన పెట్టి..

వీలైనంత త్వరగా ఈ సినిమాను మొదలుపెట్టాలని రవితేజ భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. కథ పరంగా చూసుకుంటే.. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై సెటైరికల్ గా ఈ సినిమా సాగుతుందట. గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదో కొలిక్కి వచ్చాక రవితేజ సినిమా మొదలవుతుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus