‘దేవర’ సినిమా షూటింగ్ విషయంలో, రిలీజ్ డేట్ విషయంలో గత కొన్ని రోజులుగా రకరకాల పుకార్లు వస్తున్నాయి. సినిమా అనుకున్న తేదీకి రాదని, సినిమా షూటింగ్ ఆపేశారని ఇలా రకరకాలు చెబుతున్నారు. అయితే వాటన్నింటికి కారణాలు, రుజువులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అయితే సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు ప్రారంభమవుతాయి అని అంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’,
జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమా యాక్షన్ పార్ట్ చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రవర్గాల నుండి సమాచారం అందుతోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ రూపొందించిన ఫైట్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టీమ్ అంటోంది. అందులో అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ఉందట. ఇలాంటి కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యిందని, వాటి వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా పూర్తి చేశారని టాక్.
అలాగే కీలక పాత్రల మధ్య నడిచే టాకీ పార్ట్ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని చెబుతున్నారు. ప్యాచ్ వర్క్ కాస్త మిగిలి ఉందని సమాచారం. ఆ పనులు పూర్తి చేసి పాటల కోసం విదేశాలకు వెళ్తారట. విదేశాల్లో రెండు, సెట్స్‌లో రెండు పాటల షూటింగ్ పూర్తి చేస్తారని భోగట్టా. అయితే తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5న సినిమా వస్తుందా లేదా అనేది తెలియడం లేదు.
సినిమా టీమ్ (Devara) కూడా సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ కోసం చూస్తోంది. గాయం కారణంగా రెస్ట్‌లో ఉన్న ఆయన తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాక రిలీజ్ డేట్ చెబుతారని అంటున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి పార్టు వచ్చాక రెండో పార్టుకు సంబంధించిన డేట్స్‌పై క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!