‘రెడీ’ లో చిట్టి నాయుడు పాత్ర పోషించి నవ్వులు పూయించిన మాస్టర్ భరత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతేడాది అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రంలో ఇతను కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో ఇతన్ని చూసిన వారంతా మొదట షాక్ అయ్యారు. ‘వెంకీ’ ‘కింగ్’ ‘రగడ’ ‘దూకుడు’ వంటి సినిమాల్లో బాల నటుడిగా నటించి కామెడీ పండించాడు. అయితే ఎన్టీఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ చిత్రంలో సన్నగా కనిపించాడు. ఒకేసారి ఇతని లుక్ ఇలా మారిపోయిందేంటి అని అనుకున్నారు. ఇక గతేడాది వచ్చిన ‘ఎబిసిడి’ మరింతగా సన్నబడి షాకిచ్చాడు. అసలు ఇతను ఇలా ఎందుకు మారిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తే షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చాడు.
భరత్ మాట్లాడుతూ.. “నాకు ఊహ తెలిసినప్పుటి నుండీ సినిమాల్లోనే ఉన్నాను. ఇక చదువు పరంగా మెడిసిన్ పూర్తి చేసాను.. ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నాను. తమిళంలో కూడా నేను పలు సినిమాలు చేశాను. ఆ తరువాత చెన్నైలో కాలేజీలో జాయినయిన కొత్తలో నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అప్పటి వరకూ లావుగా ఉన్న నేను సన్నబడిపోయాను. అదే సమయంలో నా కుడి కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం నాకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. జిమ్ లో వర్కవుట్ లు చేస్తున్న సమయంలో రాడ్‌లో ఉండే స్ప్రింగ్ వచ్చి నా కన్నుకి గట్టిగా తగిలేసింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు చెక్ చేసి.. కంట్లో బ్లాక్ ఉంటుందని.. మందులతో తగ్గిపోతుందని చెప్పాడు. కొన్నాళ్ళు కళ్ళ జోడు పెట్టుకుని తిరిగాను. ఇప్పటికీ అది క్యూర్ అవ్వలేదు. నాకు ఇంకా ఆ కన్ను కనిపించడం లేదు” అని చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్