సంక్రాంతి కానుగా జనవరి 13న విడుదలైన ‘మాస్టర్’ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతూ వచ్చింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికే 200కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. ముఖ్యంగా తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. అంతా బానే ఉంది అనుకున్న టైములో.. సినిమా విడుదలైన 16 రోజులకే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం రిలీజ్ అవ్వడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పాలి.
ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుని.. జనాలు వస్తున్న తరుణంలో ఇంత త్వరగా ఓటిటిలో విడుదల చేస్తే ఎలా అంటూ వారు మండిపడుతున్నారు. గురువారం(ఈరోజు) నుండే తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చిన మాస్టర్ పై తమిళ ఇండస్ట్రీలో నిరసన వ్యక్తం అవుతుండడం గమనార్హం. భారీ రేట్లు పెట్టి ‘మాస్టర్’ను కొన్న బయ్యర్లు మా పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీ వల్ల గతంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయం తగ్గిందని,
సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్న తరుణంలో ఇంత త్వరగా ఓటీటీలో విడుదల చెయ్యడం ఏంటని.. ఇది అన్యాయమని వారు లబోదిబోమంటున్నారు. ఇందుకు గాను ‘మాస్టర్’ నిర్మాతలు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.గ్రాస్ వసూళ్లలో వారికి దక్కే షేర్‌లో 10 శాతం అదనంగా చెల్లించాలని మాస్టర్ బయ్యర్లు కోరుతున్నారు.మరి నిర్మాతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..!
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!