‘మాస్టర్’ 12 డేస్ కలెక్షన్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యింది. సినిమాకి హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు కానీ..విజయ్ సేతుపతి నటన, అనిరుథ్ అందించిన మ్యూజిక్.. విజయ్ స్టార్ డం కలగలిపి.. ఈ చిత్రానికి కలెక్షన్లను రప్పిస్తున్నాయని చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగానే ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.తెలుగు సినిమాలతో సమానంగా ‘మాస్టర్’ రాబడుతున్నాడు.

ఇక ఈ చిత్రం 12 రోజులు పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.48 cr
సీడెడ్ 2.68 cr
ఉత్తరాంధ్ర 2.40 cr
ఈస్ట్ 1.29 cr
వెస్ట్ 1.23 cr
కృష్ణా 1.12 cr
గుంటూరు 1.36 cr
నెల్లూరు 0.64 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 14.20 cr

తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 12రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 14.20 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 5.2 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు. నిన్న కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 0.23 కోట్ల షేర్ ను నమోదు చెయ్యడం విశేషం. పోటీగా మరో 4 తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ అంతలా రాణిస్తుండడం అంటే మాటలు కాదు.

Click Here To Read Movie Review

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus