Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని (Hero)
  • ఎల్నాజ్, రూహి సింగ్, శ్రేయా శర్మ (Heroine)
  • అర్షద్ వార్షి, నర్గీస్ ఫక్రి, తుషార్ కపూర్ తదితరులు (Cast)
  • మిలాప్ మిలాజ్ జవేరి (Director)
  • ఏ జుంజున్వాలా - శిఖా కరణ్ అహ్లువాలియా - ఇంద్ర కుమార్ - అశోక్ తకేరియా - శోభా కపూర్ - ఏక్తా కపూర్ (Producer)
  • మీట్ బ్రోస్ - సంజీవ్ - దర్శన్ - విశాల్ (Music)
  • సంకేత్ షా (Cinematography)
  • సంజయ్ సంక్లా (Editor)
  • Release Date : నవంబర్ 21, 2025
  • బాలాజీ మోషన్ పిక్చర్స్ - వేవ్ బ్యాండ్ ప్రొడక్షన్ - మారుతి ఇంటర్నేషనల్ - శ్రీ అధికారి బ్రదర్స్ (Banner)

“మస్తీ” సిరీస్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవగా.. మూడోది మాత్రం మెప్పించలేకపోయింది. మరి 9 ఏళ్ల విరామం అనంతరం విడుదలైన నాలుగో సినిమా “మస్తీ 4” ఎలా ఉందో చూద్దాం..!!

Mastiii 4 Movie Review

కథ: ముగ్గురు స్నేహితులు (వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్తాబ్) తమ భార్యల నుండి లవ్ వీసా అనగా.. ఓ వారం పాటు భార్యల నుండి విముక్తి పొంది, వేరే అమ్మాయిలతో గడపాలనుకుంటారు. ఆశ్చర్యంగా వారి భార్యలు కూడా అందుకు ఒప్పుకుంటారు.

అయితే.. కొన్ని రోజుల తర్వాత వారి భార్యలు కూడా అదే విధమైన లవ్ వీసాను అనుభూతి చెందాలి అనుకుంటారు. దాంతో షాకైన భర్తలు ఏం చేశారు? వారి భార్యలు లవ్ వీసాను ఎలా వాడుకున్నారు? అనేది “మస్తీ 4” కథాంశం.

నటీనటుల పనితీరు: వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్తాబ్ లకు ఈ మస్తీ సిరీస్ అనేది ఫన్ గేమ్ లాంటిది. అందువల్ల వాళ్ళు నటిస్తున్నట్లుగా కాక ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంటుంది.

ఇక హీరోయిన్లుగా కనిపించిన ఎల్నాజ్, రూహి, శ్రేయలు నటించలేరు అనే క్లారిటీ ఉంది కాబట్టి, వీలైనంత పొట్టి బట్టలు వేయించి, కుదిరినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించి గ్లామర్ డాల్స్ లా వాడుకున్నారు.

మిగతా కమెడియన్లు ఉన్నంతలో సెక్సిస్ట్ జోకులతో నవ్వించడానికి విఫలయత్నం చేశారు. అవేమీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: బాలీవుడ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఎందుకో రోజురోజుకీ తగ్గిపోతున్నాయి అనిపిస్తోంది. గ్రీన్ మ్యాట్ వాడకం మరీ ఎక్కువైంది. ఇంతకుముందు చాలా చిన్న సీన్స్ కోసం కూడా లైవ్ లొకేషన్ కి వెళ్లే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు ఈమధ్య పెద్ద పెద్ద సన్నివేశాలకు కూడా గ్రీన్ మ్యాట్ లేదా స్టూడియో షూట్ లకు వెళ్లిపోవడం వల్ల.. అసలే సోది సన్నివేశాలు, ఇంకా ప్లాస్టిక్ లా కనిపిస్తున్నారు. సహజత్వం మాట దేవుడెరుగు కనీసం సినిమా చూసిన భావన కూడా కలగడం లేదు. సినిమా మీద నమ్మకం లేక కుదిరినంత తక్కువ బడ్జెట్ లో చుట్టేస్తున్నారు అని అర్ధమవుతుంది.

తన ఖాతాలో రచయితగా ఎన్నో గొప్ప సినిమాలున్న మిలాప్ మిలాన్ ఝవేరీ లాంటి దర్శకుడు “మస్తీ 4”కి దర్శకత్వం వహించాడు అంటేనే కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఈ సినిమాతో మాత్రం రచయితగా, దర్శకుడిగా తీవ్రంగా నిరాశపరిచాడు మిలాప్.

విశ్లేషణ: మస్తీ ఫ్రాంచైజ్ సినిమాలకు ఏదో క్లీన్ కామెడీ చూద్దామని ఎవరూ వెళ్లరు. కానీ.. ఆ శృంగారభరిత హాస్యం కూడా ఆహ్లాదంగా ఉండాలి, ఇబ్బందికరంగా, హేయంగా కాదు. మస్తీ & గ్రాండ్ మస్తీ సినిమాలు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అందుకు కారణం బూతు కామెడీ కూడా సెన్సిబుల్ గా ఉండడమే. కానీ.. ఈ మస్తీ4 లో మాత్రం ఆ కామెడీ బోర్డర్ దాటినా, గాల్లో ఎగిరినా హాస్యం అనేది ఏమాత్రం పండక, ప్రేక్షకుల్ని మెప్పించలేక ఢీలాపడి.. థియేటర్ల నుండి అతిత్వరగా తప్పుకుంటుంది!

ఫోకస్ పాయింట్: చీప్ కామెడీ!

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus