వరుణ్ తేజ్ (Varun Tej) ఈ ఏడాది ‘మట్కా’ (Matka) తో రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకి ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకుడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి, ముఖ్యంగా డైలాగ్స్ బాగుండటం వల్ల కొద్దిపాటి అంచనాలు ఏర్పడేలా చేసింది. కానీ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. డైలాగ్స్ ప్లేస్మెంట్ కూడా సెట్ అవ్వలేదు.
కథనం అయితే చాలా వీక్ గా ఉంది అని సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరచడం వల్ల.. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది ఈ సినిమా. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.38 cr |
సీడెడ్ | 0.12 cr |
ఉత్తరాంధ్ర | 0.28 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.07 cr |
కృష్ణా | 0.14 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.17 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.16 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 1.33 cr |
‘మట్కా’ చిత్రానికి రూ.14.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.33 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.13.67 కోట్ల దూరంలో ఆగిపోయి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.