Mazaka Collections: మజాకా’…రెండో వీకెండ్ కూడా దెబ్బ పడేలా ఉందిగా..!

సందీప్ కిషన్ (Sundeep Kishan), రావు రమేష్ (Rao Ramesh) కాంబినేషన్లో రూపొందిన ‘మజాకా’ (Mazaka)  సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యింది. ‘ధమాకా’ తో (Dhamaka)  హిట్టు కాంబినేషన్ గా పేరొందిన దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao)  , రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) ఈ చిత్రాన్ని రూపొందించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్, పరీక్షల సీజన్ కారణంగా వీకెండ్ తర్వాత ఈ సినిమా డౌన్ అయ్యింది.

Mazaka Collections:

రెండో వీకెండ్ కి కూడా కొన్ని థియేటర్స్ హోల్డ్ చేసుకోగలిగింది. కానీ రెండో వారం గట్టిగా క్యాష్ చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్సులు వస్తాయి. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.68 cr
సీడెడ్ 0.68 cr
ఉత్తరాంధ్ర 0.72 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.42 cr
కృష్ణా 0.38 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.86 cr
తెలుగు వెర్షన్ (టోటల్) 5.31 cr

‘మజాకా’ చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.5.31 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.69 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.10.08 కోట్లు రాబట్టింది.

ఎన్టీఆర్ సినిమా వల్ల దేవరకొండ సినిమా రిజెక్ట్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus