ఎన్టీఆర్ సినిమా వల్ల దేవరకొండ సినిమా రిజెక్ట్

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త ప్రాజెక్ట్‌లు ఒకదానికొకటి మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) కింగ్‌డమ్  (Kingdom) సినిమాతో బిజీగా ఉన్న విజయ్, రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో తెరకెక్కనున్న రౌడీ జనార్ధన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఇప్పటివరకు అధికారిక క్లారిటీ లేకపోయినా, మేకర్స్ మొదట రుక్మిణి వాసంత్‌ను (Rukmini Vasanth) ఎంపిక చేయాలని భావించినట్లు టాక్. సప్త సాగరాలు దాటి  (Sapta Sagaralu Dhaati) సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణి, ప్రస్తుతం ఎన్టీఆర్ (Jr NTR)  , ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

Rukmini Vasanth

ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండటంతో, ఆమె రౌడీ జనార్ధన్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో మేకర్స్ మరో యంగ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రుక్మిణి (Rukmini Vasanth) తన కెరీర్‌ను స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో, అగ్ర హీరోలతో చేసే సినిమాల్ని ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది.

ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఉండటంతో, ఆమె పూర్తిగా ఆ ప్రాజెక్ట్‌పైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో, విజయ్ దేవరకొండ సినిమా రిజెక్ట్ చేయడం ఆశ్చర్యకరమైన నిర్ణయంగా మారింది. ఇప్పుడు రౌడీ జనార్ధన్ లో విజయ్‌కు జోడీగా ఎవరు నటించబోతున్నారన్నది మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుండటంతో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ కూడా భిన్నమైన కథలు ఎంచుకుంటూ తన కెరీర్‌ను కొత్త దారిలోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే కింగ్‌డమ్ తరువాత రౌడీ జనార్ధన్ అంచనాలను పెంచగా, మరోవైపు విజయ్ రాహుల్ సంకృత్యాన్  (Rahul Sankrityan)  దర్శకత్వంలో కూడా ఓ బిగ్ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఛావా.. గీతా ఆర్ట్స్ ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తోందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus