వారి ముందు మా కష్టమంతా వేస్ట్

తాప్సీకి కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. చాలా తక్కువ సినిమాలు చేతిలో ఉన్నప్పుడు, అసలు ఆఫర్లు కూడా సరిగా లేనప్పుడు కూడా తాప్సీ చాలా ప్రోబ్లమ్స్ లో ఇరుక్కుంది. అందుకు కారణం ఆమె స్ట్రయిట్ ఫార్వార్డ్ నెస్. ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా మాట్లాడడం అనేది ముందు నుంచీ ఆమెకు పెద్ద మైనస్ గా ఉంటూ వచ్చింది. అయితే.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి ఆఫర్లతోపాటు స్టార్ డమ్ కూడా రావడంతో అదే మొహమాటపడని తత్వం ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యింది.

ఇటీవల నార్త్ మీడియాతో ముచ్చటించిన తాప్సీ ఇండస్ట్రీలో డామినేషన్ గురించి మాట్లాడుతూ.. “నిజమే మా కష్టం ఒక్కోసారి కనీసం ఒక్క సీన్ లో సరిగా నటించలేకపోయిన స్టార్ వారసుల వల్ల బూడిదలో పన్నీరైపోతుంది. ముఖ్యంగా మీడియా ముందు వచ్చినప్పుడు సినిమా కోసం ఎంతగానో కష్టపడిన మాకంటే అప్పుడే పరిచయంవుతున్న స్టార్ వారసులకు ఎక్కువగా స్పాట్ లైట్ లభించడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇకనైనా ఇండస్ట్రీలో మార్పులు రావాలి లేదంటే మాలాంటి కళాకారులందరూ బాధపడాల్సి వస్తుంది” అంటూ తాప్సీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి, ఆమె ఎవర్ని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేసింది అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. తాప్సీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన తదుపరి చిత్రాల కోసం ప్రిపరేషన్ లో నిమగ్నమైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus