కరోనా సమయంలో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన సినిమాలన్నీ ఈ ఏడాదిలో ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ‘భీమ్లానాయక్’నుంచి మొదలుపెడితే ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ ఇలా పెద్ద సినిమాలన్నీ మినిమమ్ గ్యాప్ లో వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ‘ఎఫ్3’ సినిమా విడుదల కానుంది. అక్కడితో మే నెల ఎండ్ అవుతుంది. ఇక జూన్ నుంచి మీడియం రేంజ్ సినిమాల మధ్య పోటీ మొదలుకానుంది.
రాబోయే మూడు నెలల్లో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. జూన్ లో ‘మేజర్’, ‘అంటే సుందరానికి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. అడివి శేష్ నటిస్తోన్న ‘మేజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే నాని నటిస్తోన్న ‘అంటే సుందరానికి’ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. రవితేజ హీరోగా నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’పై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. జూలై మరిన్ని సినిమాలు పోటీపడబోతున్నాయి.
గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’, వైష్ణవ్ తేజ్ చేసిన ‘రంగరంగ వైభవంగా’, రానా-సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమాను జూలై 8న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. జూలై 14న రామ్ హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’ సినిమాను, జూలై 22న నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘కార్తికేయ2’ సినిమాను విడుదల చేయబోతున్నారు.
వీటితో పాటు ‘హిట్ 2’ సినిమా కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆగస్ట్ లో ‘బింబిసార’, ‘మాచర్ల నియోజకవర్గం’ లాంటి సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తానికి ఈ మిడ్ రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!