Meenakshi Chaudhary: ఆ హీరో నాకు ఎంతో స్పెషల్.. మీనాక్షి చౌదరి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి, రవితేజ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ గుంటూరు కారం మూవీలో ఛాన్స్ వచ్చిందని తెలిసిన వెంటనే సంతోషానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు.

ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మహేష్ బాబుతోనే అని ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డానని ఆమె తెలిపారు. ఆ సమయంలో మహేష్ బాబు టెన్షన్ పడవద్దని కావాలంటే కొంచెం సమయం తీసుకోవాలని చెప్పారని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు. మహేష్ బాబు మాటలు నాలో భయాన్ని పోగొట్టాయని ఆమె కామెంట్లు చేశారు. కంఫర్ట్ కు నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని మీనాక్షి చెప్పుకొచ్చారు.

స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముద్దు సీన్లకు సిద్ధమేనని అసభ్యకరంగా లేకుంటే మాత్రమే ఆ సీన్స్ చేస్తానని మీనాక్షి వెల్లడించడం గమనార్హం. డబ్బు కంటే పనితో పాటు ప్రశంసలు దక్కాలని నేను ఫీలవుతానని ఆమె తెలిపారు. మహేష్ బాబు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని మహేష్ బాబు చాలా మంచి వ్యక్తి అని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఎంతో స్పెషల్ అని సెట్ లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారని ఆమె తెలిపారు. అందుకే మహేష్ బాబు ఆ స్థాయిలో ఉన్నారని మీనాక్షి పేర్కొన్నారు.

రవితేజ ఫైర్ బ్రాండ్ అని ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం అని ఆమె చెప్పుకొచ్చారు. గొప్ప ప్రాజెక్ట్ లో భాగం కావాలని ఫీలవుతున్నానని అప్పుడే ప్రపంచానికి మన సత్తా తెలుస్తుందని మీనాక్షి వెల్లడించారు. ఐటమ్ సాంగ్స్ కు వ్యతిరేకం కాదు కానీ ఇప్పుడే ఆ సాంగ్స్ చేయకూడదని ఫీలవుతున్నానని ఆమె (Meenakshi Chaudhary) పేర్కొన్నారు. మట్కా సినిమాతో పాటు ఒక తమిళ్ మూవీ చేస్తున్నానని మీనాక్షి చౌదరి అన్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus