#VD12: హీరోయిన్ విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్టేనా?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. పరశురామ్(బుజ్జి) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ మొదలైనట్టు ప్రచారం జరిగింది. అయితే హీరోయిన్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైంది.

కానీ కొన్ని నెలలుగా ఆమె తప్పుకుంది అనే టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మధ్య అది మరింత పెరిగింది. శ్రీలీల ప్లేస్ లో ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి ఎంపికైనట్టు కూడా కథనాలు వినిపించాయి. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘#VD12’ లో త్రిప్తి దిమ్రి మెయిన్ హీరోయిన్ అనేది అవాస్తవం అని తెలుస్తుంది. శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో, ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి ఫైనల్ అయినట్టు సమాచారం.

‘గుంటూరు కారం’ సినిమాలో మీనాక్షి చౌదరికి అన్యాయం జరిగింది అని నిర్మాత భావిస్తున్నారట. అందుకే విజయ్ దేవరకొండ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మీనాక్షి..ని ఫైనల్ గా చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదే బ్యానర్ లో మీనాక్షి చౌదరి.. దుల్కర్ హీరోగా నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు మరో ఛాన్స్ లభించింది అని స్పష్టమవుతుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus