నరసాపురం ఎం.పిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం
- March 20, 2019 / 03:09 PM ISTByFilmy Focus
మరి మన నాగబాబుగారికి ముందు నుంచీ జనసేనలో జాయినవ్వాలన్న ఆలోచన ఉందో లేక పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఇవాళ సడన్ గా పోలిటికల్ ఎంట్రీ ఇచ్చారో తెలియదు కానీ.. నాగబాబు పోలిటికల్ ఎంట్రీ మాత్రం కలకలం రేపింది. నిన్నమొన్నటివరకూ టీడీపీ మీద, ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్న మీడియా చానల్స్ మీద తన యూట్యూబ్ చానల్ సాక్షిగా యుద్ధం ప్రకటించి.. వాళ్లందరినీ ఒక ఆట ఆడుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఇవాళ అఫీషియల్ గా జనసేన పార్టీలో జాయినవ్వడమే కాక.. నరసాపురం నుంచి ఎం.పి అభ్యర్ధిగా పోటీ చేయనున్నానని కూడా ప్రకటించడం విశేషం.

- వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెస్సీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి టీజర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

నరసాపురం నుంచి నాగబాబు ఎం.పిగా గెలుస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. చాలా ఇంపార్టెంట్ అయిన నరసాపురం డివిజన్ నుంచి ఆయన్ను బరిలోపి దింపడం అనేది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఆల్రెడీ టి.డి.పి, వై.ఎస్.ఆర్.సి.పి చాలా స్ట్రాంగ్ గా పాతుకుపోయిన ఆ ఏరియాలో తన గెలుపు కోసం కొడుకు వరుణ్ తేజ్ చేత కూడా ప్రచారం చేయించేందుకు నాగబాబు సన్నద్ధమవుతున్నాడు. మరి ఈ రాజకీయ చదరంగంలో నాగబాబు పోటీ ఇప్పుడు డిస్కషన్స్ కి దారి తీసింది.













