నటి పోస్ట్.. ఫ్యాన్స్‌ కామెంట్స్‌ వైరల్‌!

చిరంజీవి అంటే మెగాస్టార్‌.. అంతకుముందు సుప్రీమ్‌ హీరో అని కూడా అనేవారు అనుకోండి. అయితే లేటెస్ట్‌, లైఫ్‌టైమ్‌ బిరుదు మాత్రం మెగాస్టార్‌. కానీ ఓ హాలీవుడ్‌ నటి చిరంజీవిని పవర్‌ మెగాస్టార్‌ చేసింది. అంతేకాదు అమె అలా అనడానికి కారణం నెటిజన్లే. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఆమె ట్వీట్లు అనేవి ఆసక్తికరంగా ఉన్నాయి. నిజానికి 25న మొదలైన ఈ ‘పవర్‌ స్టార్స్‌ – పవర్‌ మెగాస్టార్‌’ చర్చ.. ఈ రోజు మరో మలుపు తీసుకుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాల మీద చర్చ నడుస్తోంది.

ఇండియన్‌ హీరోల గురించి హాలీవుడ్‌ నటులు మాట్లాడుకోవడం గతంలో చూశాం. అయితే సౌత్‌ యాక్టర్స్‌ గురించి మాట్లాడుకోవడం ఇటీవల చూస్తున్నాం. ‘బాహుబలి’తో మొదలైన ఈ పరిస్థితి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో హైకి వెళ్లింది. అలా రెబెకా గ్రాంట్‌ అనే అమెరికన్‌ నటి 25న ఓ ట్వీట్ చేసింది. ‘మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ప్రభాస్‌ కంటే ముందు తెలుగు సినిమాలో పవర్‌ స్టార్స్‌ ఎవరు?’ అని నెటిజన్లకు ఓ ప్రశ్న వేసింది. దీనిని గమనించిన నెటిజన్లు, మెగా ఫ్యాన్స్‌.. సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు.

ఫ్యాన్స్‌ సమాధానాల్లో ఎక్కువగా వచ్చిన పేరు చిరంజీవి. దీంతో 26న మరో ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌లో ‘మీరు చెప్పినట్లు పవర్‌ మెగాస్టార్ చిరంజీవి అయితే.. ఆయన చేసిన ఏ సినిమా చూడొచ్చు. ఇంగ్లిష్‌ సబ్‌ టైటిల్స్‌ ఉన్నది చెప్పండి?’ రాసుకొచ్చింది. దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్‌ ట్వీట్లకు పని చెప్పారు. చిరంజీవి సినిమాల్లో తాము బెస్ట్‌ అనుకుంటున్న సినిమాల పేర్లను ఆమెకు సూచించడం మొదలుపెట్టారు. మరి ఇందులో రెబెకా ఏ సినిమా చూస్తుంది. ఏం రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.

ఓ అమెరికన్‌ నటి.. ఇలా తెలుగు హీరోల గురించి ట్వీట్‌ చేయడం, దానికి నెటిజన్లు ఇచ్చిన రిప్లయిలు చూసి మళ్లీ ఇంకో ట్వీట్‌ చేయడం పెద్ద విషయమే. అయితే మన సినిమా ప్రపంచ వేదిక మీద వెలగిపోతున్న ఈ సమయంలో ఇలాంటి ట్వీట్లు, చర్చలు పెద్ద విషయం కాదు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus