Veerasimha Reddy: మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ‘వీరసింహారెడ్డి’

టాలీవుడ్లో టాప్ బ్యానర్ గా పేరొందిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ పై బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు రూపొందుతున్నాయి. బాలకృష్ణ సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి సూపర్ ఫామ్లో ఉన్నాడు అతను. అలాగే ‘అఖండ’ తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి బాలయ్య కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. మరోపక్క ‘మైత్రీ’ వారు చిరంజీవితో చేస్తున్న సినిమాని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అతను పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నట్టు వినికిడి. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు వినికిడి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చాలా నెలల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే నిన్న అనూహ్యంగా బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ల సినిమా సంక్రాంతి బరిలో దిగబోతున్నట్టు ప్రకటించి ‘మైత్రి’ వారే పెద్ద షాక్ ఇచ్చారు. బాలయ్య ఫ్యాన్స్ హ్యాపీనే కానీ.. చిరు ఫ్యాన్స్ మాత్రం చాలా నిరాశ చెందారు.

అసలు సంక్రాంతికి తమ అభిమాన హీరో సినిమా వస్తున్నట్టా? రానట్టా? అనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. పైగా రిస్క్ తీసుకుని మరీ తమ బ్యానర్లో రూపొందే రెండు సినిమాలను మైత్రి వారు ఒకేసారి థియేటర్లలో రిలీజ్ చేస్తారా? సంక్రాంతికి అయితే నలుగురు స్టార్ హీరోల సినిమాలను తట్టుకునే శక్తి బాక్సాఫీస్ కు ఉంది. కానీ థియేటర్ల సమస్య వస్తుంది. వేరే సినిమా అయితే గిల్డ్ ఉంది కాబట్టి.. మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు. తమ బ్యానర్లో రూపొందే సినిమాలకే వేలల్లో థియేటర్లు కేటాయించడం అంత ఈజీ కాదు.

పైగా సంక్రాంతికి ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా ప్రభాస్ సినిమా కాబట్టి.. గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.కాబట్టి చిరు – బాలయ్య .. వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండవు. ఏదో హైప్ కోసం మైత్రి వారు ఇలా అనౌన్స్ చేసి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus