Allu Arjun: అల్లు అర్జున్ ని ఒక ఆటాడుకుంటోన్న మెగా ఫ్యాన్స్‌..!

గ‌త కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీ, మెగా బ్రాండ్‌కు దూరంగా ఉంటూ వ‌స్తోన్న స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ మ‌రోసారి ఆ బ్రాండ్‌కు, ఆ జ్ఞాప‌కాల‌కు తాను దూరం జ‌రుగుతున్న‌ట్టుగా హింట్ ఇచ్చాడు. తాజాగా బ‌న్నీ – ఏసియ‌న్ గ్రూప్స్ జాయింట్ వెంచ‌ర్‌గా అమీర్‌పేట స‌త్యం థియేట‌ర్ ద‌గ్గ‌ర ఏఏఏ మాల్ ఏర్పాటు చేశారు. నిన్న బ‌న్నీ దీనిని ప్రారంభించాడు. ఈ రోజు నుంచి ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా ఇక్క‌డ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ ఏఏఏ మాల్‌లో బ‌న్నీకి సంబంధించిన గ్యాలరీ పెట్టారు.

దానికి అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ గ్యాలరీ అన్న పేరు యాడ్ చేశారు. ఈ మాల్ చూసేందుకు వ‌చ్చిన వారికి ఇదో ఆక‌ర్ష‌ణ‌. ఈ గ్యాల‌రీలో బ‌న్నీ త‌న సినీ కెరీర్‌లో సాధించిన అవార్డుల్లో కొన్నింటిని పెట్టారు. దాని చుట్టూ అల్లు అర్జున్ సిగ్నేచ‌ర్ కూడా పెట్టారు. ఇక అల్లు అర్జున్ న‌టించిన సినిమాల పోస్టర్లతో ఫొటో ఫ్రేమ్స్ కూడా అందంగా డిజైన్ చేశారు. మ‌రోవైపు గోడ‌కు వ‌ర్కింగ్ స్టిల్స్ పెట్టారు. అల్లు అర్జున్ రాఘవేంద్రరావు, సుకుమార్, త్రివిక్రమ్, గుణశేఖర్ లాంటి దర్శకులతో కలిసి వర్క్ చేస్తోన్న‌ ఫొటోల్ని అక్కడ ఉంచారు. అలాగే బ‌న్నీ భార్య‌, అన్న‌, త‌మ్ముడు..

ఇలా త‌న కుటుంబ స‌భ్యుల‌తో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. బ‌న్నీ ప్ర‌త్యేకంగా సెల‌క్ట్ చేసిన ఫొటోలు ఇవి. అయితే ఈ వాల్‌ను బ‌న్నీ పూర్తిగా త‌న సినిమాలు, త‌న కుటుంబానికే ప‌రిమితం చేశాడు. చిరంజీవి, చరణ్, సాయితేజ్ ల‌తో దిగిన ఫొటోలు ఒక్క‌టి కూడా అక్క‌డ లేదు. ఇది కేవ‌లం నాది అన్న ఫీలింగ్ వ‌చ్చేలాగానే అక్క‌డ వాతావ‌ర‌ణం ప్రొజెక్ట్ చేశారు. అస‌లు అల్లు ఫ్యామిలీకి ఆ క్రేజ్ రావ‌డంలోనూ, ఇటు బ‌న్నీ కెరీర్ స్టార్టింగ్‌లోనూ చిరంజీవి హెల్ఫ్ ఎంతో ఉంది.

అస‌లు మెగాభిమానుల స‌పోర్ట్ లేకుండా బ‌న్నీ ఈ రేంజ్‌కు వ‌చ్చేవాడే కాద‌ని.. బ‌న్నీ మ‌రోసారి మెగా బ్రాండ్ ఇమేజ్ త‌న‌పై లేకుండా చేశాడ‌ని మెగాభిమానులు సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు దీనిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెపుతున్నా ఈ మెగా వర్సెస్ బ‌న్నీ వార్ అయితే ఇప్ప‌ట్లో ఆగేలా లేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus