తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ తో పాటు…అదృష్టం కూడా తోడైతే..ఆ హీరోనూ ఎవ్వరూ ఆపలేరు. తాజాగా మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి హీరోగా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో యువ హీరోలకు సవాల్ విసురుతూ వరుస సినిమాల్తో మంచి ఊపు మీద ఉన్నాడు. మిడ్ రేంజ్ సినిమా హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో….ఇప్పటివరకూ నటించిన మూడు సినిమాలలో ఒక్క ‘రేయ్’ డిజాస్టర్ కాగా…మిగిలిన రెండు సినిమాలు నిర్మాతలకు బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టక పోయినా….నష్టాలు అయితే మిగల్చలేదు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ సినిమా దాదాపు 18 కోట్ల కలక్షన్స్ ను రాబట్టడంతో ఈ యువహీరో స్టామినాకు తిరుగు లేదు అనే సందేశాన్ని ఇండస్ట్రీకి పంపించింది.
ఇక ఈ సినిమా రిజల్ట్ తో దాదాపుగా…18 కోట్ల నుండి 20 కోట్ల లోపు మధ్య తరహా సినిమాలను తీసే నిర్మాతలకు సాయి ధరమ్ తేజ్ కీ హీరోగా మారాడు. సెటిలైట్ రైట్స్ కి భారీ డిమాండ్ ఉండడం, సినిమాలకు మార్కెట్ సమస్యలు లేకపోవడంతో ఈ హీరోపై ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక ఈ దూకుడు తట్టుకోలేక మిగిలిన మిడ్ రేంజ్ హీరోలు తమ భవిష్యత్తుపై భయంతో ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇక ఇదే దూకుడు కొనసాగితే మాత్రం…త్వరలోనే ఈ హీరో…30 కోట్ల క్లబ్ లో చేరి రానున్న రోజులలో మెగా కాంపౌండ్ హీరోలకే సవాల్ విసిరే స్థాయికి చేరినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అని టాలీవుడ్ లో వినిపిస్తున్న వాదన. నిజమే మరి…మెగా హీరోల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా సాయి ధరమ్ తేజ్ దుమ్ము దులుపుతున్నాడు అనే మాట ఒప్పుకోక తప్పదు.