సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే మెగా స్టార్ చిరంజీవికి చాలా ఇష్టం. మహేష్ ప్రతి సినిమాని చూసి అతనితో చర్చిస్తుంటారు. అలాగే మహేష్ కి చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీలో ప్రతి స్టార్ అంటే అభిమానం. ఒకరి కుటుంబ వేడుకలకు మరొకరు హాజరవుతుంటారు. నందిని నర్సింగ్ హోమ్ ఆడియో రిలీజ్ వేడుకలో సాయి ధరమ్ తేజ్ ని మహేష్ ట్రీట్ చేసిన విధానానికి తేజు తో పాటు మెగా అభిమానులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి మహేష్, మెగా హీరోలు కలిసి నటిస్తారని ప్రచారం మొదలయింది. అది ఇన్ని రోజులకి సెట్ అయినట్లు తెల్సింది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడి పల్లి దర్శకత్వంలో నటించనున్నారు.
అమెరికా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు మొదటగా అల్లరి నరేష్ అని అనుకున్నారు. కారణం బయటికి రాలేదు కానీ అతని స్థానంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని తీసుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ వార్త అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు మెగా అభిమానులలో ఆనందాన్ని పంచుతోంది. ఈ వార్త నిజమైతే ఈ సినిమాపై క్రేజ్ పెరుగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.