గోపీచంద్ డింపుల్ హైయతి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సడ్ టాక్ సొంతం చేసుకుందని చెప్పాలి. గోపీచంద్ నటించిన లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తిరిగి గోపీచంద్ హీరోగా ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా గోపీచంద్ డీసెంట్ హిట్ అందుకున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా కథ సిద్ధం చేసుకునే సమయంలో డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమా కోసం బాగా ఎత్తు మంచి పర్సనాలిటీ ఉన్న హీరో అయితే బాగుంటుందని భావించారట. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ నుదృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేశారట. అయితే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి అయిన తర్వాత మెగా హీరోని కలిసి కథ కూడా చెప్పారని తెలుస్తోంది.
ఈ విధంగా డైరెక్టర్ కథ మొత్తం నేరేట్ చేసిన తర్వాత వరుణ్ తేజ్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో రావడమే కాకుండా చాలా ఎమోషన్స్ తో కూడుకుంది. ఇలాంటి ఎమోషన్ సినిమాలలో తాను అస్సలు సెట్ కానని వరుణ్ తేజ్ ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నారట ఇలా వరుణ్ తేజ్ ఈ సినిమాకు నో చెప్పడంతో సినిమా స్క్రిప్ట్ ప్రకారం హీరో అదే కటౌట్ లో ఉన్నటువంటి వారైతే బాగుంటుందని భావించారట.
లక్ష్యం లౌక్యం వంటి సినిమాలతో కలిసి వచ్చినటువంటి హీరో గోపీచంద్ ను కలిసి ఈ సినిమా వివరించారు. ఇలా మెగా కాంపౌండ్ కు తగలాల్సిన రామబాణం గోపిచంద్ కు తగిలిందని దీంతో వరుణ్ తేజ్ ఈ సినిమాని వదులుకోగా గోపీచంద్ ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా సినిమాని డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమాలో సీనియర్ నటీనటులు అయినటువంటి జగపతిబాబు కుష్బూ వంటి వారు నటించడం విశేషం.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?