ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలతో ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు. అలాగే ఆయన తర్వాత తన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. వారి తరువాత తరం హీరోలుగా మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చారు.
ఒక్క నాగబాబు మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు పాన్ ఇండియా హీరోలుగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఈ మెగా హీరోల రెమ్యునరేషన్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ దాదాపు ఈ ముగ్గురు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారు. వీరి తర్వాత రూ. 65 కోట్లతో చిరంజీవి నిలిచారు.
అయితే భోళా శంకర్ ఫ్లాప్ అవడంతో తో మెగా స్టార్ తన రెమ్యునరేషన్ రూ..65 కోట్ల నుండి 35 కోట్ల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నరని సమాచారం. నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రూ. 15 కోట్లు తీసుకుంటున్నాడు. ఆయన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఓ సినిమాకు రూ. 6 నుంచి 8 కోట్ల స్థాయిలో పారితోషకం తీసుకుంటున్నాడు.
మెగా ఫ్యామిలీ (Mega Heroes) నుంచి అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో వైపు అడుగులు వేస్తున్నారు. వారిలో నాగబాబు కూతురు నిహారిక నటిగా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. మరోవైపు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సైతం సినీ నిర్మాణ రంగంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!