The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి,అను ఇమ్మాన్యుయేల్ అత్యంత కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవీంద్రన్ కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. టీజర్, ట్రైలర్.. వంటి వాటితో పాటు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఆడియన్స్ ఫోకస్ పడింది.

The Girl Friend Collections

పైగా రష్మిక కొన్నాళ్ల నుండి ఏ సినిమాలో నటించినా అది సూపర్ హిట్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధిస్తుంది. ఆ నమ్మకంతోనే ‘ది గర్ల్ ఫ్రెండ్’ పై కూడా బజ్ ఏర్పడింది. నవంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా పర్వాలేదు అనే రేంజ్లో ఓపెనింగ్స్ ను రాబట్టింది.2వ రోజు కూడా వసూళ్లు బాగున్నాయి.

ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.69 cr
సీడెడ్ 0.22 cr
ఆంధ్ర(టోటల్) 0.58 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.49 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.24 cr
ఓవర్సీస్ 0.98 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.71 కోట్లు(షేర్)

‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.2.71 కోట్ల షేర్ వచ్చింది(ప్రీమియర్స్ తో కలుపుకుని). అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus