Mega Nandamuri Fans: ఆ కిక్కు లేదని ఫీలవుతున్న మెగా, నందమూరి ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉండగా చిరంజీవి, బాలయ్య చాలా సందర్భాల్లో బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడ్డారు. కొన్ని సందర్భాల్లో చిరంజీవికి విజయం సొంతమైతే మరికొన్ని సందర్భాల్లో బాలయ్యకు విజయం సొంతమైంది. కొన్ని సందర్భాల్లో మాత్రం అటు చిరంజీవి, ఇటు బాలయ్యలకు భారీ స్థాయిలో విజయాలు అయితే దక్కాయి. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన భోళా శంకర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే కానుకగా భోళా శంకర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా మాత్రం దసరా కానుకగా విడుదల కానుంది.

అయితే చిరంజీవి, బాలయ్య సినిమాలు వేర్వేరు సందర్భాల్లో విడుదల కాకుండా ఒకే సమయంలో విడుదలైతే ఫ్యాన్స్ కు ఉండే కిక్కు మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, బాలయ్య కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, బాలయ్య సినిమాల మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు తలచుకుంటే చిరంజీవి, బాలయ్య కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించడం సాధ్యమవుతుంది.

అటు చిరంజీవి, ఇటు బాలయ్య మల్టీస్టారర్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోల సినిమాలు పోటీ పడినా చిరు, బాలయ్యల మధ్య పోటీ వేరే లెవెల్ అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. చిరు, బాలయ్య భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధించాలని (Mega Nandamuri Fans) ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus