వేణుమాధ‌వ్ మృతికి చిరంజీవి సంతాపం!

ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణు మాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్ లో ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి వేణుమాధ‌వ్ అకాలమ‌ర‌ణంపై దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేసారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

వేణుమాధ‌వ్ తొలిసారి నాతో క‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడు. అటుపై ప‌లు సినిమాల్లో న‌టించి హాస్య‌న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. కొన్ని పాత్ర‌లు త‌న‌కోసమే పుట్టాయ‌న్నంతగా న‌టించేవాడు. ఆ పాత్ర‌కే వ‌న్నే తీసుకొచ్చే వాడు . వ‌య‌సులో చిన్న వాడు. సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కింకా బోలెడంత భ‌విష్య‌త్ ఉంద‌ని అనుకునే వాడిన కానీ దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూర‌ల‌ని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాన‌న్నారు”” అన్నారు

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus