ఆ భయంతోనే.. ఆ యంగ్ డైరెక్టర్ చిరుని.. కలిసి లాక్ చేసేసాడా?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో చెయ్యాల్సిన ‘ఆచార్య’ తరువాత.. సుజీత్ డైరెక్షన్లో ‘లూసీఫర్’ రీమేక్ చేయబోతున్నట్టు కూడా మెగాస్టార్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది. సుజీత్ పనితనంతో మెగాస్టార్ సంతృప్తి చెందడం లేదని.. అందుకే ‘లూసీఫర్’ రీమేక్ ను తనకు ఎంతో నమ్మకస్తుడు అయిన డైరెక్టర్ వినాయక్ చేతిలో పెట్టినట్టు ప్రచారం నడుస్తుంది.

ఈ టాక్ నిజమో కాదో తెలీదు కానీ.. మరో యంగ్ డైరెక్టర్ బాబీ.. వెంటనే టెన్షన్ పడి చిరు వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది. ‘చిరు 154’ ను బాబీ డైరెక్షన్లో చేయబోతున్నట్టు కూడా మెగాస్టారే చెప్పుకొచ్చారు. బాబీ చెప్పిన ఓ లైన్ కు మెగాస్టార్ ఇదివరకే ఓకే చెప్పారు కూడా..! ఇప్పుడు మెగాస్టార్ తన విషయంలో కూడా మనసు మార్చుకుంటాడేమో అని దర్శకుడు బాబీ భయపడ్డడో ఏమో కానీ వెంటనే మెగాస్టార్ ను కలిసి డైలాగ్ వెర్షన్ వినిపించాడట. బాబీ వర్ణించిన విధానం చిరుకి బాగా నచ్చిందట.

కొన్ని మార్పులు కూడా చెప్పి.. డామ్ షూర్ గా ఈ ప్రాజెక్ట్ చేద్దాం అని బాబీకి హామీ ఇవ్వడంతో అతను ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. రవితేజతో ‘పవర్’ , పవన్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’, వెంకటేష్- నాగ చైతన్యలతో ‘వెంకీమామ’.. వంటి చిత్రాలను డైరెక్ట్ చేసాడు బాబీ. ఇతని సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం మిస్ కాకుండా చూసుకుంటాడు. అందుకే మెగాస్టార్ కూడా ముందు నుండీ ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాడు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus