Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తల్లి అంజనా దేవి ఆరోగ్యం గురించి పలు రకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలతో మెగా అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె అస్వస్థతకు గురయ్యారని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. దీని వల్ల మెగా ఫ్యామిలీ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే, ఈ వార్తలపై స్వయంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నట్లు కొన్ని మీడియాలో వార్తలు వచ్చినట్లు గమనిస్తున్నాను.

Chiranjeevi

నిజానికి ఆమె కొన్ని రోజులుగా కొంచెం అస్వస్థతగా అనిపించింది. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా కొలుకుంటున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని ట్వీట్ చేశారు. తన తల్లి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. “మీడియా ప్రతినిధులను మనవి చేసుకుంటున్నాను. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాగానాలు ప్రచురించకండి. మీరు అర్థం చేసుకుంటారని అభినందిస్తున్నాను” అని ఆయన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

ఇదే విషయంపై మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వ్యక్తులు కూడా స్పందించారు. “అంజనా దేవి గారు కేవలం రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఎలాంటి ప్రధాన సమస్య లేదు. ప్రస్తుతం ఇంటికి తిరిగి వచ్చారు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు” అని తెలిపారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా విజయవాడలో ఉన్నపుడు ఈ వార్తల గురించి తెలిసి, హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.

తల్లి ఆరోగ్యం బాగుందని తెలిసిన తర్వాత పవన్ కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం ఎంత వైరల్ అయ్యిందో, చిరంజీవి ట్వీట్ వచ్చిన తర్వాత అదే వేగంగా సద్దుమణిగింది. చిరు చెప్పినట్లు, ఇలాంటి సందర్భాల్లో ఊహాగానాలు కాకుండా నిజమైన సమాచారాన్ని తెలుసుకుని ప్రచారం చేయడం అవసరమనే విషయం మరోసారి రుజువైంది.

1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus