మహేష్ బాబు హీరోయిన్ ఘాటు కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ నటి సనమ్ శెట్టి (Actress ) అందరికీ సుపరిచితమే. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘శ్రీమంతుడు’ లో (Srimanthudu) మేఘన అనే అతిధి పాత్రలో నటించింది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) హీరోగా వచ్చిన స్పూఫ్ కామెడీ మూవీ ‘సింగం 123’, మానస్ నాగులపల్లి హీరోగా తెరకెక్కిన ‘ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.ఆ తర్వాత తెలుగులో ఈమెకు ఛాన్సులు రాలేదు.తమిళ, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ అనుకున్న బ్రేక్ రాలేదు.

Actress

అయితే తాజాగా ఈమె తమిళ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యింది. తమిళ సినిమా పరిశ్రమలో లింగ వివక్ష ఉంటుంది. సమానత్వం ఉండదు. పురుష నటులను ఎక్కువగా గౌరవిస్తారు. కానీ మహిళ నటులకి సరైన గౌరవం ఇవ్వరు. నాకు ఇందులో వ్యక్తిగత అనుభవం ఉంది. ఇక్కడ చాలా మంది నిర్మాతలు సినిమాల కోసం, నటన కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల నటీమణులను సంప్రదిస్తారు.

సినిమా పాత్రల కోసమే వాళ్ళు మమ్మల్ని సంప్రదించారేమో అని అనుకుంటాం. కానీ అది మా అపోహే. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పడుకోవడానికి మాత్రమే పిలుస్తారు” అంటూ సంచలన ఆరోపణలు చేసింది సనమ్ శెట్టి. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం తమిళనాట మాత్రమే కాదు తెలుగులో కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే సనమ్ శెట్టి చేసిన కామెంట్స్ కొత్తవి ఏమీ కాదు. పరిశ్రమలో మార్పు రావాలి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా ఉన్నాయి. తాను ఏ నిర్మాత వాళ్ళ బాధపడిందో చెప్పకుండా ఇలా మాట్లాడటం వల్ల.. ఆమెకు కలిసొచ్చేది పెద్దగా ఏమీ ఉండదు అని అంతా అభిప్రాయం పడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus