Vishwak Sen: మొత్తానికి దిగొచ్చిన విశ్వక్ సేన్.. సారీ చెబుతూ ఎమోషనల్ లెటర్!

విశ్వక్ సేన్ (Vishwak Sen)  సినిమాల్లో కంటెంట్ ఎలా ఉన్నా.. వాటి ప్రమోషన్స్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాయి. అతను యూత్ ని టార్గెట్ చేసే ప్రమోషన్స్ ను డిజైన్ చేసుకుంటాడు. అయితే ‘లైలా’  (Laila) విషయంలో అవి కొంచెం శృతిమించాయి. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అంటూ అంతా పెదవి విరిచారు. సినిమా రిజల్ట్ సంగతి తర్వాత..! వీటి వల్ల విమర్శలు ఎక్కువయ్యాయి. విశ్వక్ సేన్ ని సామాన్య ప్రేక్షకులు కూడా తిట్టిపోస్తున్నారు.

Vishwak Sen

దీంతో విశ్వక్ సేన్ దిగొచ్చి అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేశాడు విశ్వక్ సేన్ ఈ లెటర్ ద్వారా స్పందిస్తూ.. “నమస్తే,ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ – నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి – హృదయపూర్వక క్షమాపణలు.

నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు.

నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను.అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, నా కథానాయకులు – దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు.త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తాను.నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం” అంటూ రాసుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus