పనిలో పనిగా కథ చెప్పి ఓకే చేసేసుకుంటాడా?

‘క్రాక్‌’ విడుదల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని ఎంత ఆనందంగా ఉన్నారో, చిరంజీవి కుటుంబం కూడా అంతే ఆనందంగా ఉందట. సినిమా విడుదలయయాక ప్రత్యేక షో చూసిన చిరంజీవి, రామ్‌చరణ్‌ సినిమా గురించి, చిత్రబృందం గురించి సోషల్‌ మీడియాలో గొప్పగా రాసుకొచ్చారు. అంతేకాకుండా రవితేజ, గోపీచంద్‌ మలినేనికి చిరంజీవి ఫోన్‌ చేసి అభినందించారు అని కూడా తెలుస్తోంది. గోపీచంద్‌తో మాట్లాడుతూ ఒంగోలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారట. చిరంజీవి విద్యాభ్యాసం కోసం కొన్నాళ్లు ఒంగోలులో ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.

ఒంగోలులో తన అనుభవాల గురించి చాలాసార్లు, చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ‘క్రాక్’ సినిమా చూశాక చిరంజీవి మరొకసారి నాటి రోజులు గుర్తొచ్చాయట. గోపీచంద్‌ కూడా అక్కడి వ్యక్తి కావడంతో, ఆ రోజుల గురించి మాట్లాడుకున్నారట. సినిమాల చూపించిన చాలా సీన్స్‌, విషయాల గురించి వారి మధ్య చర్చకు వచ్చాయట. ఒంగోలులో రాత్రి 8 తర్వాత కరెంట్‌ ఆపి మర్డర్లు చేయడం, వేటపాలెం హత్యలు లాంటివి మాట్లాడుకున్నారట. సినిమా ముచ్చట్లు అన్నీ అయిపోయాక… గోపీచంద్‌కు చిరంజీవి బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చాడని తెలుస్తోంది.

‘ఆచార్య’ షూటింగ్‌ స్పాట్‌ రావాలని గోపీచంద్‌కు చిరంజీవి కోరాడట. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్న గోపీచంద్‌… త్వరలోనే సెట్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడట. పనిలోపనిగా చిరంజీవికి ఓ కథ చెప్పి ఓకే చేసుకుంటాడేమో చూడాలి. అసలే చిరు వరుస సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. దీంతో పనిలో పనిగా గోపీచంద్‌ కూడా కథ చెప్పేస్తే సరి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus