మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నిన్న.. ‘జీబ్రా’ (Zebra) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా విచ్చేశారు. అందరికీ తెలిసిన సంగతే. సత్యదేవ్ (Satya Dev) ఇందులో హీరో. మొదటి నుండి సత్యదేవ్ కి చిరు బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ‘జీబ్రా’ అతని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ.అందుకే చిరు తన వంతు ప్రమోషన్ చేయడానికి ఈ వేడుకకు వచ్చారు. ఇక చిరు స్పీచ్ ఇస్తూ కొన్ని మంచి అంశాలపై స్పందించిన సంగతి గమనించే ఉంటారు. ‘పెద్ద సినిమాలు మాత్రమే కాదు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది.
కానీ చిన్న సినిమాలు ఓటీటీకే పరిమితమవుతున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ ‘హనుమాన్’ (Hanu Man) ‘ఆయ్’ (AAY) ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ‘మత్తు వదలరా’ (Mathu Vadalara 2) వంటి చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యాయి.. కంటెంట్, ప్రమోషన్ బాగా ఉంటేనే విజయాలు దక్కుతాయి అని చిరు గుర్తుచేశారు. కానీ ఎంత కంటెంట్ బాగున్నా.. చిన్న సినిమా వెనుక ఓ పెద్ద హస్తం లేకపోతే రిలీజ్ అవ్వడం చాలా కష్టం. సరే అది చిరుకి తెలియంది కాదు.. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం.
మరోపక్క హీరో సత్యదేవ్ గురించి చిరు మాట్లాడుతూ.. ‘ ‘గాడ్ ఫాదర్’ (God Father) లో విలన్ రోల్ కోసం నార్త్ నుండో ఎక్కడి నుండో ఆర్టిస్ట్..లను తీసుకురమ్మని అడిగారు. తర్వాత సత్యదేవ్ ని తీసుకుంటే.. అతను చేయడం ఏంటి అన్నట్టు అన్నారు. మన వాళ్ళకి మన వాళ్ళు నచ్చరు’ అంటూ చెప్పుకొచ్చారు. నిజమే..టాలీవుడ్లో ఇప్పుడు రూపొందుతున్న సినిమాల్లో చిన్న చితకా పాత్రల కోసం కూడా పక్క భాషల నుండి నటీనటులను తీసుకొస్తున్నారు.
వాళ్లకి ఫ్లైట్ టికెట్లు వేసి, ఎంత అడిగితే అంత ఇచ్చి , ఇక్కడ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి మరీ అపురూపంగా చూసుకుంటున్నారు. దీనిపై చాలా మంది సీనియర్లు గోల పెడుతున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిరు కూడా సత్యదేవ్ విషయంలో చూపించిన సింపతీ.. మిగిలిన నటీనటుల విషయంలో చూపించడం లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా చిరు స్పీచ్ లో కాంట్రడిక్షన్లు ఉన్నా.. ‘మన నటీనటులు అంటే మన వాళ్ళకి లోకువ(చిన్న చూపు) ‘ అనే మాట అయితే కరెక్టే..!