పూరీకి ఓ రేంజ్ కౌంటర్ వేసిన మెగాస్టార్…!

  • March 28, 2020 / 06:25 PM IST

ఓ పక్క మెగాస్టార్ ‘ఆచార్య’ చేస్తూ ఇప్పటి వరకూ బిజీగా గడిపారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా అటాక్ వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ గ్యాప్ లో ఉగాది పండుగ కూడా ఉండడంతో … ఇదే మంచి ముహూర్తం అని మెగాస్టార్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎంట్రీ ఇచ్చారో లేదో… ఆయనకి ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది.

మహేష్ బాబు, మోహన్ లాల్ , అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీలు ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ట్వీట్ లు వేశారు. అలా తనని విష్ చేసిన వారికి … ధన్యవాదాలు తెలుపుతూ మెగాస్టార్ .. వారికి సంబంధించిన విషయాలతో ముచ్చటించారు. ఈ క్రమంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా …’సోషల్ మీడియాలోకి స్వాగతం సార్. కరోనా వల్ల సామాజిక దూరం పాటిస్తున్నప్పటికీ సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుంది’ అంటూ మెగాస్టార్ ను విష్ చేసాడు.

పూరీ జగన్నాథ్ ట్వీట్ కు స్పందించిన చిరు…. ‘థాంక్యూ పూరీ జగన్నాథ్. కరోనా కారణంగా మంచి ఫ్యామిలీ టైమ్ లభిస్తోంది. ముంబై, బ్యాంకాక్ బీచ్ లను నువ్వు మిస్ అవుతున్నావేమో కానీ… పవిత్ర, ఆకాశ్ నీతో సమయాన్ని గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు’ అంటూ రిప్లై ఇచ్చారు. దీని పై పూరి స్పందిస్తూ ‘లవ్ యూ అన్నయ్యా’ అని ఆ కౌంటర్ కు రిప్లై ఇచ్చి సరిపెట్టాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus