మెగాస్టార్ చిరంజీవి పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై మాత్రమాకు కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఎంతో మంది కార్మికులకు తనదైన శైలిలో సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.ఇక కరోనా సమయంలో కార్మికుల కోసం సహాయ సహకారాలు చేసిన చిరంజీవి ఇప్పటికీ ఎవరైనా ఆపదలో ఉన్నారు
అని తెలిస్తే మాత్రం టక్కున వారికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని చేయడం లేదా వారి కోసం చిరంజీవి ముందు నిలబడుతూ వారికి భరోసా కల్పిస్తుంటారు.అయితే ఈయన చేసిన సహాయాన్ని అందుకున్న వారు చెప్పడం తప్ప చిరంజీవి ఎప్పుడు తాను పలానా సహాయం చేశాను అని చెప్పుకున్న దాఖలాలు లేవు. ఇలా సినీ కార్మికుల కోసం మాత్రమే కాకుండా తనని ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి తన కాలేజీకి కూడా ఈయన ఓ గొప్ప సహాయం చేశారు.
తాను చదువుకున్న కాలేజీలో కొన్ని అభివృద్ధి పనుల కోసం ఈయన గొప్ప మనసు చాటుకుని కొంతమేర ఆర్థిక సహాయం చేసినట్లు తెలుస్తోంది.గతంలో చిరంజీవి రాజకీయాలలో కొనసాగిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన రాజకీయాలలో కొనసాగుతున్న సమయంలో ఈ కాలేజీ కోసం ఏకంగా 50 లక్షల నిధులను మంజూరు చేశారట.
ఇలా 50 లక్షలు నిధులు విడుదల చేయడమే కాకుండా సొంతంగా తాను కూడా కొన్ని లక్షల రూపాయలు కాలేజీ కోసం దానం చేశారని తెలియడంతో మెగాస్టార్ మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక చిరంజీవి (Chiranjeevi) ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన భోళా శంకర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా